తెలుగులో టాప్ యాంకర్‌లో ఒకరైన అనసూయ అంటే యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడున్న యాంకర్స్‌లో అందాలు ఆరబోస్తూ యూత్‌ను తనవైపుకు తిప్పుకోవటంలో అనసూయ స్టైలే వేరు. అందుకే ఈ మధ్య అనేక ప్రొగ్రామ్స్ చేస్తూ… రెండు చేతుల సంపాదిస్తోంది ఈ భామ.
అయితే… కొత్తగా వస్తున్న లోకల్ గ్యాంగ్ ప్రోగ్రాంలో అనసూయ డాన్స్‌ను యూత్ ఎంజాయ్ చేస్తుండగా… ఫ్యామిలీ ప్రేక్షకులు మాత్రం ఏంటీ అనసూయేనా ఇలా చేస్తోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. తన తోటి జడ్జ్, డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్‌తో కలిసి అనసూయ అందాలు ఆరబోస్తూ చిందేస్తోంది.
ప్రతి వారం డోస్ పెంచుతూ… అనసూయ, శేఖర్ మాస్టర్‌లు డాన్స్ చేస్తుండగా ఓ ప్రొఫెషనల్ డాన్సర్‌కు ఏమాత్రం తక్కువ అన్న చందంగా అనసూయ డాన్స్‌తో పాటు అందాలు ఆరబోస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. రెమ్యూనరేషన్ ఎఫెక్ట్ అని కొందరు, ఈ అందాల డాన్స్‌లే సినిమా చాన్సులకు దారి వేస్తాయని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
తాజాగా విడుదలైన లోకల్ గ్యాంగ్ ప్రోమోలో అనసూయ అందాల డాన్స్ మీరూ చూడండి….