గ్లామరస్ టాలీవుడ్ యాంకర్ అనసూయ మరోసారి వార్తల్లో నిలిచింది. మంగళవారం వాలెంటైన్స్ డే సందర్భంగా అనసూయ తన భర్తతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘నీతో లైఫ్ క్రేజీగా.. రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుందంటూ’ కాప్షన్ కూడా ఇచ్చింది. ఈ ఫొటోకు పలువురు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘అదేం లేదులే అక్కా.. వాడి దగ్గర బాగా డబ్బుంది.. దట్స్ ఇట్’ అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కు అనసూయకు కోపం వచ్చి, నెటీజన్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.
‘అదేంట్రా తమ్ముడూ.. అలా అనేశావు. ఎంతుందేంటి డబ్బు? నాకు లేదా మనీ మరి?. చెప్పు.. నీకన్నీ తెలుసు కదా.. అయినా ఆయన డబ్బు, నా డబ్బు అనేది కూడా ఉందా? రేయ్ చెప్పరా బాబూ. అయినా బావ గారిని వాడు, వీడు అనొచ్చా? ఇదేం పెంపకంరా నీది.. చెంపలేసుకో.. లేకపోతే నేను వేస్తా చెప్పులతోటి.. సారీ నా అర్థం చెప్పులతో చెంపలేస్తానని’ అంటూ స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది..
ఆ నెటిజన్ మరోసారి రియాక్ట్ అవ్వగా.. అనసూయ స్పందించి ‘నీ బొందరా నీ బొంద మాట్లాడటం నేర్చుకో ఫస్ట్. అంతర్యామిలా అన్నీ తెలిసినట్లు బిల్డప్ ఒకటి. నా రియాలిటీ నీకేం తెలుసురా? పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట. నీ బుద్ధి మనీ ఒకటే అయితే అందరిదీ అదే అనిపిస్తుంది. వీలైతే మారు. గెట్ వెల్ సూన్. తమ్ముడివి కదా.. మంచి, చెడు చెప్తున్నా.. ఏమనుకోకయ్యా’ అంటూ స్వీట్‌గా మరో రిప్లై ఇచ్చింది.
అయితే ఈ గొడవ ఇంతటితో ఆగలేదు. ఆ నెటీజన్ వరుసగా కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. అనసూయ రెండు, మూడు కామెంట్స్ కు రిప్లై ఇచ్చి నాకెందుకులే అనుకుని రిప్లై ఇవ్వలేదు. ఇలా వాలెంటైన్స్ డే రోజున అనసూయ మరో వార్తతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.