తన అందంతో, టాలెంట్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యాంకర్ అనసూయ. ఓవైపు యాంకర్ గా చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ కనిపిస్తుంది ఈ బామ. అయితే… ఇప్పుడు అనుకోకుండా ఓ జాక్ పాట్ కొట్టేసినట్లు ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది.
ఈ మధ్య అనసూయ గ్లామర్ డోస్ పెంచేసింది. కొత్తగా వస్తున్న షోలలో తన అందాలను ఆరబోస్తుండటంతో అనసూయపై ఎన్నో రూమర్లు షికారు చేస్తున్నాయి. ఓ దశలో శేఖర్ మాష్టర్ కు అనసూయ భర్త స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
ఇక మెగా హీరోలతో వెండితెరపై కూడా అనసూయ ఆడిపాడింది. విన్నర్ సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో, రంగస్థలం సినిమాలో చరణ్ తో నటించిన ఈ హాట్ యాంకర్, ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో ఓ ఐటెం సాంగ్ లో రెజీనా ఉండగా, సెకండ్ ఆఫ్ తర్వాత వచ్చే ఏ స్పెషల్ సాంగ్ లో అనసూయ కనిపిస్తుందని తెలుస్తోంది.
ఇందుకు అనసూయ ఇప్పటికే ఒప్పుకుందని, ఇందుకోసం భారీగానే పారితోషికం కూడా తీసుకుందని ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.