జబర్దస్త్ షో తో బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్న యాంకర్ అనసూయ. తన అందంతో, అభినయంతో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన ఈ అమ్మడు సినిమాల్లో కూడా ఛాన్స్ లు కొట్టేసి తన టాలెంట్ నిరూపించుకుంది. క్షణం, రంగస్థలంలో అనసూయ పోషించిన పాత్రలు ఆమెకు చాలా మంచి పేరుని తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకు టాలీవుడ్‌కే పరిమితమైన అనసూయ త్వరలోనే బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఎంటర్‌టైన్ చేయబోతుందని వార్తలు వినపడుతున్నాయి.
ఆమెకు బాలీవుడ్‌లో అవకాశం వచ్చిందని, అయితే సినిమాల్లో కాదట సీరియల్‌లో అని సమాచారం. హిందీలో టాప్ రేటెడ్ సీరియల్‌లో ఓ కీలక పాత్ర కోసం అనసూయను సంప్రదించారట. మరి ఈ వార్తలపై అనసూయ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.