యాంకర్ గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనసూయ… శృంగార తార సిల్క్ స్మిత బయోపిక్ లో నటిస్తున్నారన్న వార్త సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఈ ప్రచారం జోరందుకోవటంతో అసనూయ క్లారిటీ ఇచ్చింది.
సిల్క్ స్మిత బయోపిక్ లో తాను నటించటం లేదని, అది కేవలం ప్రచారమేనని తేల్చేసింది. నటుడు విజయ్ సేతుపతి సినిమాలో నటిస్తున్నానంటూ అనసూయ తెలుపుతూ… సిల్క్ స్మిత తరహాలో మేకప్ వేసుకుని షూటింగ్‌లో పాల్గొంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో అందరూ అనసూయ సిల్క్ పాత్రల నటిస్తుందని భావించారు. కానీ ఫైనల్ గా అందులో నిజం లేదని ప్రకటించింది ఈ హాట్ హీరోయిన్.
I am NOT playing #SilkSmita garu in any biopic. Thank you. 🙂
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 9, 2020
Advertisements