జబర్ధస్త్ షో యాంకర్ అనసూయకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తాను ఏ షూట్‌కు వెళ్లినా… తన పిక్స్‌ను సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేస్తూ ఉంటుంది. ఇటు సినిమాల్లోనూ అనసూయ మెప్పిస్తుండటంతో… ఆమెకు ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది.
అయితే, కొందరు అనసూయపై అసభ్యకరంగా కామెంట్స్ చేస్తుండటంపై అనసూయ సీరీయస్ అయ్యింది. శృతిమించి చేస్తున్న వ్యాఖ్యలపై ఇక స్పందించకపోతే సహానానికి అర్థం ఉండదని కామెంట్స్ చేసింది. అంతేకాదు ఈ అంశంపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసింది అనూయ. తనపై కామెంట్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.