యాంకర్ అనసూయ తన అందంతో కుర్రకారు మతిపోగోట్టేస్తోంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఈ అమ్మడు రెచ్చిపోతుంది. ప్రస్తుతం అనసూయ లోకల్ గ్యాంగ్స్ షోలో తన విశ్వరూపం చూపిస్తోంది. నిజానికి అనసూయ ఇంతకుముందు చేసిన పలు షోల్లో డ్యాన్స్ చేయడం అంతంత మాత్రంగానే ఉండేది. కానీ లోకల్ గ్యాంగ్స్ లో మాత్రం అనసూయ ఫుల్ జోష్ తో డ్యాన్స్ చేస్తోంది. అదిరిపోయే స్టెప్పులతో అభిమానులను అల్లరిస్తోంది. అయితే అనసూయ డ్యాన్స్ కు అదే షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఫిదా అవుతున్నారట. తనతో కలిసి అను డ్యాన్స్ చేస్తుంటే జానీ మాస్టర్ షాక్ అవుతున్నారట. ఆమె డ్యాన్స్ ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాడట.
అయితే తాజాగా లోకల్ గ్యాంగ్స్ షో ప్రోమో విడుదలైంది. ఇందులో అనసూయ తన డ్యాన్సుతో హంగామా చేసింది. పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాలోని పాటకు అనసూయ వేసిన స్టెప్పులు ఓ రేంజులో ఉన్నాయి. ముఖ్యంగా జానీ మాస్టర్ అనసూయ కొంగు చాటులో తలపెట్టి డ్యాన్స్ చేస్తూ ఇద్దరు ఇరగదీశారు. అయితే జానీ మాస్టర్ అకస్మాత్తుగా ఇలా చేయడంతో అనసూయ కొంత ఇబ్బందికి లోనైనా ఆ ప్రభవాన్ని డ్యాన్స్ పై పడకుండా చూసుకుంది ఈ అమ్మడు .