తన పుట్టిన రోజు సందర్భంగా కీసర మండలం లోని గర్భిణి స్త్రీలకు న్యూట్రిషన్ కిట్స్‌ని పంపిణీ చేశారు ప్రముఖ యాంకర్ అనసూయ. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ చేతుల మీదుగా దాదాపు 100 మంది గర్భిణీ మహిళలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ చేశారు.
ఈ సందర్భముగా అనసూయ మాట్లాడుతూ మహిళలు గర్భిణీలుగా ఉన్న సమయంలో ఆదుకోవడం , మా అదృష్టం గా భావిస్తున్నామని అన్నారు. రంగస్థలం సినిమాలో రంగమ్మత గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెర నుంచి క్రమేణా వెండితెరపై ఓ వెలుగు వెలుగుతుంది. ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య, కృష్ణవంశీ రంగమార్తాండ సినిమలో నటిస్తుంది.