తన యాంకరింగ్ తో పాటు తన అందాలను ఆరబోస్తూ అలరించే బ్యూటీ అనసూయ. అప్పుడప్పుడు వెండితెరపై సందడి చేసే ఈ భామ… ఈ మధ్య వరుసగా సినిమాలకు ఓకే చెప్తుంది. తాజాగా… మాస్ మహరాజ్ రవితేజ కోసం అనసూయ ఇటలీ ఫ్లైట్ ఎక్కినట్లు తెలుస్తోంది.
రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడీ సినిమాలో కూడా అనసూయ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ కోసమే అనసూయ ఇటలీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో రవితేజపై యాక్షన్ సీన్స్ షూట్ చేయనుండగా…. అనసూయ కూడా ఉండనుందని తెలుస్తోంది.
తను ఇటలీలో ఉన్నానని చెప్పుకుంటూ… అనసూయ హలో మిలాన్ అంటూ ఓ ఫోటోని పోస్ట్ చేసింది. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram