ఓవైపు హాట్ యాంకర్ గా కొనసాగుతూనే, మరోవైపు సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది అనసూయ. రంగస్థలం మూవీలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ఖిలాడీ మూవీలోనూ అనసూయ ఓ ఐటెం సాంగ్ తో పాటు కీలకమైన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నారు. ఇందులో అనసూయ సినిమాను మలుపు తిప్పే పాత్రతో పాటు ఐటెం సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బుధవారం నుండి అనసూయ షూటింగ్ కు కూడా అటెండ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఓసినిమాలో ఐటెం సాంగ్ కోసం అనసూయ 20లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిలింనగర్ టాక్. మరీ ఇప్పుడు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో చూడాలి.