ఆర్ఎక్స్ 100 సినిమా తో మంచి హిట్ ను అందుకున్నాడు హీరో కార్తికేయ. అలాగే యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ చిత్రం తర్వాత గుణ 369, 90ML, హిప్పి చిత్రాలను చేశాడు. ఇక ప్రస్తుతం చావు కబురు చల్లగా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి నటిస్తోంది. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా తాజాగా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
మార్చి 19న ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా పోస్టర్ విడుదల చేసింది. మరోవైపు ఈ సినిమాలో జబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రత్యేక పాటలో ఆడిపాడనుంది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అవుట్ అండ్ అవుట్ మాస్ బీట్ తో సాగే ఈ పాటను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.