తన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న అందాల బొమ్మ అనసూయ. బుల్లితెరపై షో లతో పాటు, అప్పుడప్పుడు సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ మెరుస్తూ ఉంటుంది. అయితే పెళ్లి అయ్యాక కూడా లైఫ్ లో సక్సెస్ సాధించవచ్చు అనటానికి అనసూయ ఒక నిదర్శనం అనే చెప్పాలి. పెళ్లి అయ్యాక కూడా అనసూయ తన గ్లామర్ తో ఎంతో మందిని ఆకట్టుకుంది.
అనసూయ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అనసూయ ప్రేమ కథ ఇప్పుడు కాదట, ఏకంగా ఇంటర్ సెకండ్ ఈయర్ లోని ప్రేమకు విత్తనాలు పడ్డాయట. ఇంటర్ చదువుతున్న సమయంలో ఎన్.సి.సి క్యాంప్ కి వెళ్లిన అనసూయ గ్రూప్ కమాండర్ గా ఉండేదట. అదే గ్రూప్ లో భరద్వాజ్ కూడా ఉన్నాడట. అనసూయను చూసిన భరద్వాజ్ తన ఇష్టం పెంచుకున్నాడట, ఇంకా ఆలస్యం చేస్తే బాగోదు అని వెంటనే వెళ్లి ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుందాం అని చెప్పేశాడట. ఆ సమయంలో అనసూయకు ఏమి చెప్పాలో అర్ధం కాలేదట. కానీ ఆ క్యాంప్ లో అనసూయ భరద్వాజ్ కు ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిందట. మళ్ళీ సంవత్సరం అదే క్యాంప్ లో ఇద్దరు కలుసుకున్నారట. అలా ఇంటర్ లో అనసూయ భరద్వాజ్ ల ప్రేమ కథ మొదలైందట.
ఈ అంశాలన్నీ ఓ ఇంటర్వ్యూలో అనసూయ సిగ్గుపడుతూ తన ప్రేమ వ్యవహారం ఇంటర్ నుండే మొదలైందని బయటపెట్టింది.