జబర్ధస్త్ కామెడీ షోకు అందాలను జోడించి వెండితెర ప్రేక్షకులను మైమరిపించే యాంకర్ అనసూయ… ఇటు సినిమాల్లోనూ అప్పుడప్పుడు మెరుస్తూ ఉండే విషయం తెలిసిందే. మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్‌తో ఔరా అనిపించిన అనసూయకు ఆ తర్వాత పెద్దగా సినిమా చాన్స్‌లు రాలేదు.
చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు వచ్చినా… రంగస్థలంలో వచ్చినంత క్యారెక్టర్ ఎలివేషన్ రాలేదు. దాంతో అనసూయ చిన్న సినిమా పాత్రలను చేస్తూనే… టీవీషోలు చేసుకుంటుంది.
అయితే, అనసూయకు తాజాగా మరో పెద్ద సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మరోసారి అనసూయకు మంచి చాన్స్ ఇవ్వనున్నట్లు ఫిలింనగర్ వర్గాల టాక్. త్వరలో తెరకెక్కబోతున్న సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో మంచి క్యారెక్టర్‌కు అనసూయ సైన్ చేసినట్లు తెలుస్తోంది.