బుల్లితెరపై ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతున్న యాంకర్లు అనసూయ, రష్మీ. జబర్ధస్త్ షోతోనే ఇద్దరు కెరీర్ మొదలుపెట్టారు. తమ అందాలతో, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ఇద్దరు నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఒకవైపు బుల్లితెరపై షోలు చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా ఛాన్స్ లు కొట్టేస్తున్నారు. ప్రస్తుతానికి అనసూయ జబర్దస్త్ తో పాటు లోకల్ గ్యాంగ్ షో లో చేస్తుంది. మరో వైపు రష్మీ ఢీ ఛాంపియన్స్, జబర్దస్త్ షో లు చేస్తుంది. అంతే కాకుండా ఈ ఇద్దరు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో కూడా ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు. తాజాగా ఈ ఇద్దరు బామలు పెట్టిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
Advertisements