సోషల్ మీడియాలో తనపై కామెంట్ చేసే వారికి యాంకర్ అనసూయ ఇచ్చే రిప్లై మాములుగా ఉండవు. తాజాగా మరోసారి ఓ వ్యక్తి క్షమాపణ చెప్పినా వదలకుండా ఫైర్ అయ్యింది.
అఆ సినిమాలో సమంత అనుకుంటున్నావా… అంటూ అనసూయ పెట్టిన ఫోటోకు ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు. దీనికి అనసూయ రిప్లై ఇస్తూ అయ్యయ్యో… లేదమ్మా… నన్ను అనసూయ అంటారని రిప్లై ఇచ్చింది. దీంతో తాను రిప్లై ఇస్తూ సారీ మేడమ్… ఎదో సరదాకి అలా అన్నాను అంతే. లైట్ తీసుకోండని కోరాడు.
అయినా అనసూయ వదలకుండా… అవును నువ్వు మానసికంగా ఇంకా కిడ్ గానే ఉన్నట్లున్నవని అర్థమైంది అంటూ ఘాటుగా స్పందించింది. త్వరగా ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
View this post on Instagram