క్రికెట్ జరుగుతున్నప్పుడు కొన్ని కామెడీ సీన్స్ కూడా కెమెరా కంటపడుతుంటాయి. అలాంటి ఘటన ఒకటి సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో చోటు చేసుకుంది. బంతిని బౌండరీ లౌన్ వద్ద ఆపేందుకు ప్రయత్నించిన ఫీల్డర్ నేరుగా మహిళా యాంకర్ ను ఢీకొట్టడం అక్కడున్న అందరికీ నవ్వు తెప్పించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సౌత్ ఆఫ్రికా టీ20 లో భాగంగా సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్- ఎంఐ కేప్ టౌన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. సన్ రైజర్స్ బ్యాటింగ్ సమయంలో సామ్ కరన్ వేసిన 13వ ఓవర్లో డీప్ వికెట్ మీదుగా మార్కో జాన్సన్ కొట్టిన షాట్ బౌండరీవైపు దూసుకెళ్ళింది. ఈ క్రమంలో ఇద్దరు ఫీల్డర్లు బంతిని ఆపేందుకు ప్రయత్నించారు.
ఇదే సమయంలో కోచ్ లను ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్ట్ జైనాబ్ అబ్బాస్ బౌండరీ వద్ద ఉంది.దీంతో నేరుగా యాంకర్ను ఫీల్డర్ ఢీకొట్టడంతో ఆమె బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయింది. కానీ పెద్ద గాయం ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ ఎంఐ కేప్ టౌన్ పై సన్ రైజర్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేప్ టౌన్ 20 ఓవర్లలో 171/6 స్కోర్ చేయగా…సన్ రైజర్స్ 19.3 ఓవర్లలో 172 /8 పరుగులు చేసి విక్టరీ సాధించింది. మార్కో జాన్సన్ 27 బంతుల్లో 66 రన్స్ చేసి సన్ రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
A collision in SA20.
Marco Jansen's knock will be remembered by her! pic.twitter.com/2sxbYd30LZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 18, 2023