బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 ముగిసింది. శ్రీముఖి, రాహుల్ మధ్య జరిగిన పోటీలో రాహుల్ గెలిచాడు. ఇక్కడితో ముగిసిందనుకున్న బిగ్ బాస్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా యాంకర్ ఝాన్సీ రాహుల్ గెలవటం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ‘అమెరికా లాంటి దేశంలోనే మహిళను అధ్యక్షురాలిని చెయ్యాలనుకోవట్లేదు…అలాంటిది తెలుగు ప్రేక్షకులు మాత్రం బిగ్ బాస్ లో మహిళను గెలిపిస్తారా’ అంటూ కామెంట్ చేసింది. ఇప్పటికే శ్రీముఖి కి మద్దతుగా జబర్దస్త్ రామ్ ప్రసాద్, యాంకర్ రష్మీలు ప్రచారాలు కూడా చేశారు.
రాహుల్ గెలిచాక కూడా ఝాన్సీ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు సెటైర్ లు వేస్తున్నారు. నువ్వు కూడా యాంకర్ వి కదా అందుకే సపోర్ట్ చేస్తున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది బిగ్ బాస్ సీజన్ 2 లో కూడా మహిళ అయిన గీతా మాధురి ఓడిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నిస్తున్నారు.