క్రికెటర్ సువర్ట్ బిన్నీ అప్పుడప్పుడు మెరుస్తూ… వార్తల్లో నిలిచే ఆటగాడు. అతన భార్య ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాతలతో డిస్కషన్స్‌లో పాల్గొంటూ హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. తనదైన డ్రెస్సింగ్‌తో తనకంటూ ఓ క్రికెట్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న యాంకర్.
ఈ మధ్య బిన్నీ పెద్దగా కనపడకపోవటంతో నెటిజన్స్ ట్రోల్ చేస్తూ… కొన్ని వ్యాఖ్యలు చేశారు. బిన్ని ఎక్కడా అని ఓ అభిమాని అడగ్గా… భార్య మయంతి లగేజ్ మోస్తున్నట్లున్నాడు అని కామెంట్ చేశారు. దీంతో మయంతి తనదైన స్టైల్లో జవాబిచ్చింది. నా లగేజ్‌ను నేను మోసుకోగలను. థాంక్స్… బిన్నీ క్రికెట్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఖాళీగా లేడు కాబట్టి తనకు తెలియని వ్యక్తులపై కామెంట్స్ చేయటం లేదంటూ చెంప చెల్లుమనిపించేలా జవాబు చెప్పింది. దీంతో ఆ టాపిక్ అలా క్లోజ్ అయ్యింది.
ఈ మధ్య మ్యాచ్‌ల సందర్భంగా మయంతి ఎక్కడ కనపడ్డా బిన్నీ చర్చే జరుగుతుండగా… బిన్నీ కనపడ్డా భార్య మయంతి ఎక్కడో… అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.