బుల్లితెర పై ఓ వెలుగు వెలుగుతున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ఇటీవల వ్యక్తిగత కారణాలవల్ల కొన్ని రోజులు తెరపై కనిపించకపోయిన ప్రదీప్, ఇప్పుడు మళ్ళీ బుల్లితెర పై నవ్వించటానికి సిద్ధం అయ్యాడు. అయితే ప్రస్తుతం శేఖర్ మాస్టర్, నాగబాబు లాంటి వాళ్ళు జబర్దస్త్, ఢీ షోలను విడిచిపెట్టటంతో ప్రదీప్ కూడా దూరం అవుతున్నారని ప్రచారం జరిగింది. మరో వైపు కొత్తగా జీ తెలుగులో వస్తున్న షోలలో ప్రదీప్ కు షేర్ ఉందని కూడా ప్రచారం జరిగింది.
అయితే ప్రదీప్ ఇప్పుడు మరో షాక్ ఇచ్చాడు. బ్యాక్ ఇన్ యాక్షన్ ఢీ ఛాంపియన్స్ అంటూ సెట్ లో దిగిన ఓ ఫోటో ని ఇంస్టాగ్రామ్ లో పోస్టుచేశాడు. దీనిని బట్టి ప్రదీప్ ఢీ ఛాంపియన్స్ లో చేస్తున్నాడని అర్ధం అవుతుంది. మరో వైపు అనసూయ కూడా ఎక్కడికి పొవట్లేదు, జరబర్దస్త్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది.