యాంకర్ ప్రదీప్ అనగానే మాటల ప్రవాహాంతో పాటు పంచ్‌ల వర్షం గుర్తొస్తుంది. షో ఏదైనా యాంకర్‌గా ప్రదీప్ ఉన్నాడంటే మినిమం గ్యారెంటీ హిట్ అని డిసైడ్ అయిపోవాల్సిందే. ఇటు యాంకర్ సుమ కూడా అంతే. ఫీమేల్, మేల్ యాంకర్స్‌లో తెలుగులో టాప్‌లో ఉన్నది వీరే. కానీ వీరిద్దరు ఓకే షోలో ఉంటే….?
సుమ మాటల టైమింగ్‌కు రచయితలు కూడా ఫిదా అయిపోతారు. తెలుగమ్మాయి కాకపోయినా చక్కని తెలుగుతో, ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా హస్యం పండిస్తుందన్న పేరుంది. కానీ అలాంటి సుమకే ప్రదీప్ పంచ్‌లు వేస్తూ అలరించాడు.
ప్రదీప్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించటం ఎలా…?. ఈ సినిమా యూనిట్ విడుదల చేసిన నీలి నీలి ఆకాశం పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇప్పటికే రెండో పాటను కూడా రిలీజ్ చేయగా, ప్రమోషన్స్‌ను స్పీడప్ చేసింది ప్రదీప్ అండ్ టీం.
ప్రమోషన్స్‌లో భాగంగా ప్రదీప్‌తో పాటు సింగర్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, డైరెక్టర్ మున్నా, డాన్స్ మాస్టర్ యశ్వంత్‌లు క్యాష్ ప్రోగ్రాంలో ఈ వారం సందడి చేయబోతున్నారు. అయితే… ఈ షోకు ఎవరు వచ్చినా డామినేషన్ మాత్రం సుమదే ఉంటుంది. కానీ ఈసారి అందుకు రివర్స్‌గా ప్రదీప్ సుమపై పంచ్‌ల వర్షం కురిపించాడు. మిగతా ముగ్గురిని యాంకర్ సుమ డామినేట్ చేస్తూ, పంచ్‌లు వేసి నవ్వించగలిగినా… ప్రదీప్ దగ్గరికి వచ్చే సరికి మాత్రం ప్రదీప్ చేతిలో పంచ్‌లు వేయించుకోవాల్సి వచ్చింది.
ప్రదీప్ సుమపై వేసిన కామెడీ పంచ్ మీరూ చూడండి….
ఇప్పటికే వివాదాలు చుట్టుముడుతున్నప్పటికీ… అవన్నీ పట్టించుకోకుండా సినిమా సక్సెస్‌పై ప్రదీప్ దృష్టిపెట్టినట్లు కనపడుతోంది.