యాంకర్ ప్రదీప్… తన యాంకరింగ్‌కు కామెడీతో పాటు టైమింగ్‌ను జోడించి పంచ్‌లు వేస్తుంటాడు. అందుకే తెలుగులో ఏ మేల్ యాంకర్‌కీ దక్కని క్రేజ్ ప్రదీప్ సొంతం అయింది. ప్రదీప్ తర్వాత ఎంతో మంది యాంకర్‌లు వచ్చినా నిలదొక్కుకోలేకపోయారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రదీప్ టైమింగ్ యాంకరింగ్ అంటే.
ఇక నుంచి అలాంటి సినిమాలు చెయ్యను ?
అయితే… ప్రదీప్ సినిమాలకు కొత్తేమీ కాదు. గతంలో పవన్ నటించిన అత్తారింటికి దారేదీ, అల్లు అర్జున్ నటించిన జులాయి, జూనియర్ ఎన్టీఆర్ నటించిన రామయ్య వస్తావయ్య సినిమాలో ప్రదీప్ అందిరినీ మెప్పించాడు. కానీ ఆ తర్వాత సినిమా చాన్స్‌లు వచ్చినా… ఎందుకో నో చెప్తూ వచ్చాడు. అయితే… హీరోగా చేసే ఉద్దేశంతోనే ప్రదీప్ అలా చేశాడని ఫిలింనగర్ టాక్. కానీ ప్రదీప్ సన్నిహితులు మాత్రం టైం లేకపోవటంతోనే అంటూ వెనకేసుకొచ్చారు. అయితే… ఇటీవల ప్రదీప్ సడన్‌గా మాయం అవటంతో… ప్రదీప్‌కు అనారోగ్యం, ప్రదీప్ దివాళా తీశాడు ఇలా రకరకాల ప్రచారం జరిగింది.
ఫోటో షూట్ లతో అదరగొడుతున్న పాయల్
పైగా ప్రదీప్ చేస్తున్న తన సొంత షో… కొంచెం టచ్‌లో ఉంటే చెప్తాతో టాలీవుడ్ సూపర్ స్టార్స్‌తో ప్రదీప్ పరిచయాలు విపరీతంగా పెరిగాయి. టాలీవుడ్ టాప్ హీరో హీరోయిన్స్ అంతా ప్రదీప్ కామెడీ టైమింగ్‌ను ఇష్డపడుతుంటారు. అయితే ప్రదీప్ అలా కూడా సినిమా అవకాశాలు వచ్చినా… తాను రిజక్టె చేశాడని తెలుస్తోంది. కానీ ఇటీవల ప్రదీప్ హీరోగా సినిమా ప్రారంభమైంది. అయితే కొంత షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత ప్రదీప్ చేస్తున్న సినిమా బడ్జెట్ చిక్కులతో అర్ధాంతరంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నో ఆశలతో ప్రదీప్ ఫస్ట్ మూవీ గ్రాండ్‌గా ప్లాన్ చేసుకుంటే ఇలా అయిపోయింది ఏంటీ అన్న భాదలో ఉన్న ప్రదీప్ రెండో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రదీప్ రెండో మూవి లవ్ ట్రాక్‌లో సాగుతుందని… ఓ బడా డైరెక్టర్ దగ్గర ఎంతో కాలంగా పని చేస్తున్న వ్యక్తికి డైరెక్టర్‌గా ప్రమోషన్‌తో ప్రదీప్‌లోని లవర్ బాయ్‌ను బయటకు తీయబోతున్నారని ఇండస్ట్రీ టాక్. మరీ రెండో మూవీ చివరి వరకు ఎలాంటి అంతరాయం లేకుండా నడుస్తుందో…. ప్రదీప్‌లోని లవర్ భాయ్ జనాన్ని ఎంత మేరకు సాటిస్‌ఫై చేస్తాడో చూడాలి.
Advertisements
బికినిలో కాజల్ అగర్వాల్ రచ్చ రచ్చ