యాంకర్ ప్రదీప్ బ్యాచ్‌లర్ కష్టాలు తీరటం లేదు. ప్రదీప్ పెళ్లెప్పుడు అని అడిగే వారు ఇప్పుడు ప్రదీప్ ఇంకెప్పుడు నీ పెళ్లి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిన మాటీవీ పెళ్లిచూపులంటూ ఓ షో కూడా చేసింది. ఆ షో హిట్టా-ఫట్టా అన్నది పక్కన పెడితే ప్రదీప్‌కు అలా పెళ్లిచూపులు జరిగాయి.
అయితే మరోసారి పెళ్లిచూపుల వంటి షోతో రాబోతున్నాడు ప్రదీప్. అయితే ఈ సారి డెయిల్ సీరీయల్‌లా కాకుండా కేవలం రెండు రోజుల పాటు మాత్రమే షో ప్రసారం కాబోతుంది. పైగా అది జీ తెలుగులో. అవును… సంక్రాంతి సంబురాల పేరుతో జీతెలుగు బుల్లితెర నటులతో కలిసి రెండు రోజులు ప్రసారమయ్యేలా ఓ షో చేసింది. భారీ ఎత్తున చేసిన ఆ షోలో యాంకర్‌గా ప్రదీప్‌తో పాటు శ్యామల కూడా ఉంది. అక్కడ కూడా ఇప్పుడు ప్రదీప్ ఇంకా పెళ్లిచేసుకోవా అనే కాన్సెప్ట్‌తోనే షో అలరించనుంది.
ఎరుపులో మెరిసిపోతున్న పూజా హెగ్డే
Advertisements