నాకోసం ఎంతో మంది నన్ను చూడటానికి వచ్చారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో జనసందోహం ఎక్కువగా ఉండటంతో పోలీసులు అందరిని అక్కడ నుంచి పంపించారు. నన్ను చూడటానికి వచ్చిన అందరికీ నేను క్షమాపణలు చెప్తున్నాను అంటూ ట్విట్టర్ లో వీడియో ను పోస్ట్ చేసింది జబర్దస్త్ యాంకర్ రష్మీ. రాజమండ్రిలో శుక్రవారం ఓ స్టోర్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యారు. ఆమెను చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు రావడంతో, కరోనా వైరస్ దృష్ట్యా పోలీసులు వారిని వెంటనే అక్కడి నుంచి పంపించి వేశారు.
అయితే ప్రజలంతా కరోనా వైరస్ భయంతో బిక్కు బిక్కు మంటుంటే ఇలా ఓపెనింగ్స్ అంటూ తిరగటం ఏంటంటూ కొంత మంది రష్మీని ప్రశ్నించగా దీనికి ఆమె స్పందిస్తూ.. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమ ఒప్పందం ఇప్పటిది కాదు. ఎప్పుడో డేట్ ఇవ్వడం జరిగింది. ఓపెనింగ్ కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చింది. ప్రస్తుతం కరోనా వైరస్ దృష్ట్యా ప్రజలు ఎవ్వరూ ఈ కార్యక్రమానికి రారని అనుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు హాజరుకాకపోయినా పరవాలేదని స్టోర్ యాజమాన్యం, నేను ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే ఈ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయినా కొందరు స్టోర్ వద్దకు చేరుకున్నారు. ప్రజలు గుమిగూడి ఉండరాదనే ఆంక్షలతో వారిని పోలీసులు పంపించారు. ఇప్పటికైనా కరోనాపై అందరూ అవగాహనకు రండి. ప్రాణాలు ముఖ్యం అని గ్రహించి, ప్రభుత్వాలు చెబుతున్న జాగ్రత్తలు వహించండి అంటూ ట్వీట్ చేసింది.
https://twitter.com/rashmigautam27/status/1240900431200407552