జబర్దస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై, గుంటూరు టాకీస్ సినిమా తో తన అందాలను ఆరబోసి, అందరికళ్ళు తనవైపుకు తిప్పుకున్న సుందరి రష్మీ. ఒక పక్క బుల్లితెరపై అందరిని అలరిస్తూ మరో వైపు వెండితెర మీద కూడా మెరుస్తూ తాను ఎందులోనూ తక్కువ కాదంటూ నిరూపించుకుంది రష్మీ.
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ పొట్టి పొట్టి డ్రెస్ లు వేసుకుని ఫోజిలిస్తూ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా రష్మీ కొత్త స్టిల్స్ తో ఫోటోలను పోస్ట్ చేసింది. చిలుక పచ్చ రంగు చీరలో, వయ్యారంగా ఫోజులిస్తూ ఫోటోలను పోస్ట్ చేసింది. చీరకట్టులో రష్మిని చూసిన నెటిజన్లు కామెంట్స్ రూపంలో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.