ఈ మధ్య కాలంలో అందాల యాంకర్ పేర్లలో మొదటి పేరు రష్మి గౌతమ్ పేరు వినిపిస్తోంది. ఇండస్ట్రీలోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆమె ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీషో ద్వారనే ప్రేక్షకులకు మరింత దగ్గరైయ్యారు.
తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. అవకాశం వచ్చినప్పుడల్లా అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్నారు రష్మి గౌతమ్. అది అలా ఉంటే ఆమె తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
రష్మి గౌతమ్ రెమ్యూనరేషన్ గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు రష్మి ఒక్కో షోకి రూ.1.5 నుంచి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
ఆ మధ్య రష్మి హీరోయిన్‌గా నటించిన ‘గుంటూరు టాకీస్’ కేవలం తన అందచందాలతోనే హిట్ అయ్యిందని అంటారు.. ఆమె అభిమానులు. ఓ వైపు టీవీల్లో యాంకరింగ్, మరోవైపు సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం రష్మీ కెరీర్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.
అంతేకాకుండా ఆమెలో మరో కోణం కూడా ఉంది అది ఏంటంటే.. సామాజిక అంశాలపై స్పందించడం. మహిళలపై రేపుల విషయంలో కానీ, మూగ జీవాల సంరక్షణలోగాని స్పందిస్తూ.. ట్వీట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెబుతూ సామాజిక స్పృహా ఉన్న అందాల యాంకర్‌గా పేరు తెచ్చుకుంది.
ఇక ఇదే విషయంలో తాజాగా ట్విట్టర్ వేదికగా రష్మి ఆ మధ్య స్పందించారు. బ్రూనో అనే ఓ కుక్క విషయంలో భాగంగా కేరళ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో ఇలాంటీ చేష్టలు ఏంటనీ ప్రశ్నించారు రష్మి. వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురం బీచ్‌లో ముగ్గురు వ్యక్తులు ‘బ్రూనో’ అనే కుక్కని కట్టేసి క్రికెట్ బ్యాట్‌తో అతి క్రూరంగా కొడుతూ చావబాది చంపేశారు. దాని పై రష్మి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రస్తుతం నందు హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో రష్మి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌లో రష్మి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.