రష్మీకి ఫోన్‌ ఇస్తారా...? నెటిజన్స్‌ తెగ ట్రై చేస్తున్నారట - Tolivelugu

రష్మీకి ఫోన్‌ ఇస్తారా…? నెటిజన్స్‌ తెగ ట్రై చేస్తున్నారట

యాంకర్ రష్మీ అంటే యూత్‌లో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు. రష్మీతో మాట్లాడాలన్న తపన చాలా మందికి ఉంటుంది. అక్కడే లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంది రష్మీ. తను సహాయం చేయాలనుకొని చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు రష్మికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది.

ఓ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన రెండు కుక్క పిల్లలను ఎవరైనా దత్తత తీసుకుంటారా…? అంటూ రష్మీ ఓ ట్వీట్ పెట్టారు. ట్వీట్‌తో పాటు ఆసక్తి ఉన్న వారు ఈ నెంబర్‌కు కాల్ చేయండి అంటూ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. అంతే… ఆ ఫోన్‌కు కాల్స్‌ కుప్పలుతెప్పలుగా వచ్చాయట. కానీ వారంతా ఫోన్ చేసింది కుక్కపిల్లల కోసం కాదట… రష్మీ ఉందా, ఓసారి మాట్లాడుతా ఫోన్ ఇస్తారా అని అడిగారట.

రష్మీ పెట్టిన ఫోన్ నెంబర్ ఖైరతాబాద్‌కు చెందిన ద్రువ్‌ అనే సోషల్ వర్కర్‌ది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అతను రష్మీకి విషయం చెప్పాడట. దీంతో… రష్మి వారిపై ఆగ్రహంతో ఓ వీడియో రిలీజ్ చేశారు. కుక్క పిల్లలను తీసుకుంటారేమోనని ట్వీట్ చేశా. సెలబ్రిటీలతో మాట్లాడాలని అంతా అనుకుంటారు కానీ కాస్తయిన బుద్ది వాడండి. ఎవరైనా అలా పబ్లిక్‌గా నెంబర్ పెడతారా…? నా సంగతి పక్కన పెట్టండి, మీరు నెంబర్ అందరికీ ఇచ్చేస్తారా అని కాస్త క్లాస్ పీకింది. మూగజీవాలకు సాయం చేస్తున్న దృవ్‌ను ఇబ్బంది పెట్టకండి అంటూ మండిపడ్డారు రష్మీ.

Share on facebook
Share on twitter
Share on whatsapp