జబర్దస్త్ హాట్ యాంకర్ రష్మీ యాంకర్ గానే కాకుండా హీరోయిన్ గా కూడా చేస్తోంది. ప్రస్తుతం రష్మీ ఓ రొమాంటిక్ సినిమాలో నటిస్తోంది. తన అందాలతో కుర్రకారు మదిని దోచేస్తోన్న రష్మీ .. హీరోయిన్ గా అందాలను ఆరబోయడంపై ఓ ఇంటర్వ్యూలో ఆమెను ప్రశ్నించారు. గ్లామర్ పాత్రలనే ఎందుకు చేస్తున్నారంటూ ఆమెకు ఓ ప్రశ్నఎదురైంది. ఇందుకు రష్మీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.
ప్రస్తుతం అందంగా, వయస్సులో ఉన్నాం కనుక అలాంటి పాత్రలను చేస్తున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా వయస్సు పైబడిన తరువాత గ్లామర్ పాత్రలను చేస్తామంటే ఎవ్వరు అంగీకరించరు కదా.. అయిన అప్పుడు అలాంటి అవకాశాలు కూడా రావని చెప్పుకొచ్చింది. రష్మీ బోల్డ్ చిత్రంలో నటించడంపై పలు విమర్శలు వస్తోన్న వేళ ఈ సమాధానంతో ఆమె అందరి నోళ్లను మూయించింది. ఇకపై సినిమాలో వరుస అవకాశాలు వస్తే నటిస్తానని చెప్పుకొచ్చింది.