ప్రియమైన వాడితో రష్మీ షికారు అనగానే.. ఎవరబ్బా అతను అనుకుంటున్నారా..?ఎలాగూ రష్మీ, సుడిగాలి సుధీర్ లు ప్రేమించుకుంటున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే… ? దీంతో ఆమె సుధీర్ తో సరదాగా షికారుకు బయటకెళ్ళిందని అనుకుంటున్నారా..? అలాంటిదేమి లేదండీ.. ఈ స్టోరీ చదివితే మీకే అర్ధం అవుతుంది..
బుల్లితెరపైనే కాదు.. సినిమాలో కూడా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారులో క్రేజ్ సంపాదించుకుంది యాంకర్ రష్మీ. జబర్దస్త్ షోలో యాంకర్ గానే చేస్తూనే ఓ వైపు సినిమాలో కూడా నటిస్తోంది. ఈ కామెడీ షోలో తన అందాలను అక్కడక్కడ ఆరబోస్తూనే సినిమాలో రెచ్చిపోతుంది ఈ యాంకర్. ఆమె నటించిన ‘గుంటూరు టాకీస్’ కేవలం రష్మీ పేరుతో పాటు.. ఈ సినిమాలో ఆమె ఆరబోసిన అందాలతోనే హిట్ అయ్యిందని చెబుతారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయమై అడిగితే.. వయస్సులో ఉన్నప్పుడు గ్లామర్ పాత్రలను చేయడంలో తప్పేమి ఉందంటూ ఆమె కౌంటర్ బాగానే ఇచ్చింది. ఇక వాలెంటన్స్ డే సమీపిస్తుండటంతో రష్మీ తన ప్రియమైన వాడితో సరదాగా షికారుకు బయల్దేరింది.
రష్మీ తన మనస్సుకు దగ్గరైన తన పెట్ (కుక్క పిల్ల)తో కలిసి షికారుకు వెళ్ళింది. తన పెట్ చేసిన అల్లరిని ఆమె సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. తన ప్రియమైన వాడితో వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. రష్మీ వెరైటీగా వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుందంటున్నారు నెటిజన్లు.