సుడిగాలి సుధీర్-రష్మి జోడి ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారిద్దరు తిట్టుకున్నా… ముసి ముసి నవ్వులతో మెరిసిన అభిమానులు మురిసిపోతుంటారు. ఇక వీరిద్దరి మధ్య ప్రేమాయణంపై ఎన్ని కామెంట్స్ వస్తాయో… వస్తున్నాయో అందరికీ తెలిసిందే.
సుధీర్ రష్మీలు మేము స్క్రీన్‌పై నటిస్తాము అని ఎంత చెప్పినా… ప్రేక్షకులు మాత్రం వీరిద్దరి మధ్య కొంచెం అయినా లవ్ ఫీలింగ్స్ లేకపోతే… ఆ ఎఫెక్షన్ ఎలా కనపడుతుందని ప్రశ్నిస్తుంటారు. వారిద్దరి మధ్య ఉన్న లవ్ ట్రాక్‌కు స్క్రీన్ తోడయ్యిందన్నది అభిమానుల మనోగతం.
అయితే… సుధీర్ రష్మిలు షోలలో గొడవపడటం కామన్. అది షో వరకే ఉంటుందన్నది అందరికీ తెలుసు. అయితే… ఈసారి ఏకంగా సుధీర్‌పై రష్మి చేయి చేసుకోవటం హాట్ టాపిక్ అవుతోంది.
కానీ అంతా అనుకుంటున్నట్లు ఇదేదో సీరీయస్‌గా కాదండి. ప్రేమికుల రోజున రాబోతున్న ఎక్స్‌ట్రా జబర్ధస్త్ షోలో రష్మీ-సుధీర్‌ల లవ్ ప్రపోజల్ సీన్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ సందర్భంగా సుధీర్ చెప్పే డైలాగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే. ఇక సుధీర్ చిలిపి చేష్టలకు అంతే ప్రేమగా సుధీర్‌ను రష్మీ ఎలా బెదిరించిందో చూడండి…
Advertisements