తన అల్లరితో పంచ్ డైలాగ్స్ తో అతితక్కువ సమయంలోనే యూత్ కి దగ్గరయిన యాంకర్ రవి. ఎప్పుడు షోలతో బిజీ బిజీ గా గడిపే రవి ఇటీవల కొన్ని విషయాలు బయటపెట్టాడు. ప్రస్తుతం రవికి ఎంతో పేరు తెచ్చిన పటాస్ షో నుంచి మనోడు తప్పుకున్న సంగతి తెలిసిందే. రవి కన్నా ముందు శ్రీముఖి బిగ్ బాస్ షో కోసం తప్పుకుంది. అయితే రవి తప్పుకోటానికి కారణం శ్రీముఖి రవిల మధ్య గొడవలేనని ప్రచారం జరుగుతుండటంతో రవి స్పందింస్తూ తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పుకొచ్చాడు.
మరో వైపు ఓ స్నేహితుడు రవిని మోసం చేశాడట. రెండేళ్లు కలసి ఉన్న స్నేహితుడు మోసం చెయ్యటంతో చాలా బాధపడ్డాడట రవి. లక్ష, పదిలక్షలు కాదట ఏకంగా 45 లక్షల రూపాయలు మోసం చెయ్యటంతో రవికి దిమ్మతిరిగిందటా. పటాస్ నుంచి తప్పుకోటానికి కారణం లేకపోలేదని, రోజూ కనిపించే కన్నా… వారానికి రెండుసార్లు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ లతో రావటం మంచిదనిపించిందని, అందుకే పటాస్ నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు. త్వరలోనే సొంత నిర్మాణంలో ఓ షో ను చేయబోతున్నట్టు చెప్పుకొచ్చాడు రవి.