యాంకర్ రవి బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా చెప్పనవసరం లేదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదం తో వార్తల్లో నిలిచే రవి పెళ్లి గురించి కూడా చర్చలు జరిగాయి. మొదట రవి లాస్య మధ్య ఏదో ఉంది అంటూ ప్రచారం జరిగింది. తరువాత శ్రీముఖి పేరు వచ్చింది. వీటన్నింటికి సమాధానం ఇస్తూ ఇటీవల ఓ కార్యక్రమానికి తన ఫ్యామిలీ తో వచ్చాడు రవి. తన భార్య,పాపను పరిచయం చేశాడు. అప్పటి వరకు రవికి పెళ్ళిజరిగిందా, లేదా అనేది ఒక ప్రశ్నగా ఉండేది. ఎప్పుడూ షూటింగ్ లలో బిజీ గా ఉండే రవి టైం దొరికినప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటాడు.