పటాస్ తో బుల్లితెరమీద నవ్వులు పూయించే యాంకర్ రవి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్షితో వార్తల్లో నిలిచే రవి తాజాగా మరో సారి వార్తల్లోకి వచ్చాడు. సోషల్ మీడియా వేదికగా హౌలే గాళ్ళకి దూరంగా ఉండాలంటూ రాస్తుకొచ్చాడు రవి.
రవి కామెంట్ కి కారణం లేకపోలేదు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న శ్రీముఖి ఇటీవల తన లవ్ స్టోరీ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సమయం లో శ్రీముఖి ఒక ఫేమస్ పర్సన్ ని లవ్ చేశా, అనుకోని నిజం తెలిసి బ్రేకప్ చేసుకున్నాను అంటూ చెప్పింది.
రవి శ్రీముఖి కలిసి పటాస్ షో లో ఎలా ఉండేవాళ్ళో అందరికి తెలుసు కానీ పటాస్ 2.0 శ్రీ ముఖి తప్పుకుంది. ఇదంతా చుసిన నెటిజన్లు శ్రీముఖి లవ్ చేసిన పర్సన్ రవి అని చెప్పుకుంటున్నారు.