తన భర్త ఆత్మహత్య చేసుకున్నదంటూ వస్తున్న వార్తలపై తమిళ, తెలుగు సీరియల్ నటి రేఖ స్పందించారు. గోపినాథ్ ఆత్మహత్య చేసుకున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు రేఖ. ఇటీవల గోపినాథ్ పెరంబూరులో సూసైడ్ చేసుకున్నాడని, తన ఆఫీస్ లో పనిచేసే ఓ యువతితో గోపినాథ్ అక్రమసంబంధం పెట్టుకున్న కారన్నగా రేఖకు, గోపినాథ్ కు మధ్య తఱచుగోడవలు జరిగేవని వార్తలు వచ్చాయి. ఆత్మహత్య చేసుకున్నది తన భర్త కాదని స్పష్టం చేసింది.
సూసైడ్ చేసుకున్న వ్యక్తి భార్య పేరు జెనీఫర్ రేఖని, ఆమె పేరులో కూడా రేఖ ఉండటం కారణంతో పాటు తన భర్త పేరు గోపీనాథ్ కావడంతో అందరు తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు మీడియాలో ప్రచారం జరిగింది. ఇక తన భర్తతో తనకు ఎలాంటి గొడవలు లేవని మేమిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉన్నామన్నారు.