జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో… బుల్లితెరపై సంచలనం సృష్టించిన జబర్దస్త్ ఇటీవల ఏదో ఒక హాట్ టాపిక్ తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. జబర్దస్త్ షో కు మొదటి నుంచి వెన్నుముక గా ఉన్న నాగబాబు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. మొదట జబర్దస్త్ షో ఆపేస్తున్నారని వార్తలొచ్చాయి. ఆ తరువాత, కొత్త టీం లీడర్లు వస్తున్నారు పాత టీం లీడర్లు నాగబాబుతో వెళ్లిపోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే నాగబాబుతో చంద్ర, ఆర్పీ మినహా మిగిలిన వారందరు జబర్దస్త్ షోలోనే కొనసాగుతున్నారు. మరో వైపు యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ నుంచి బయటకు రాబోతుందని గతంలో వార్తలు వచ్చాయి. ఆ వార్తల అనసూయ స్పందిస్తూ నేను ఎక్కడికి వెళ్ళటంలేదు అంటూ వివరణ ఇవ్వటంతో అప్పట్లో ఆ వార్తలకు బ్రేక్ పడింది.
అయితే ప్రస్తుతం అనసూయ జబర్దస్త్ తో పాటు ఇంకో రెండు షో లు కూడా చేస్తుంది. మరో వైపు సినిమాలు చేస్తుంది. దీనితో జబర్దస్త్ కు సమయం కేటాయించలేకపోతుందని, ఇక పై జబర్దస్త్ కు దూరం అవ్వాలనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. అనసూయ జబర్దస్త్ షోతోనే బుల్లితెరకు పరిచయం అయింది. ఆ తరువాత తన అందంతో అభినయంతో సినిమాల్లో అవకాశాలను కొట్టేసింది. అలా ఒకవేళ జబర్దస్త్ నుంచి అనసూయ వెళ్లాలని భావిస్తే మల్లెమాల కూడా ఈ విషయంలో సిద్ధంగా ఉందని సమాచారం. అనసూయ ప్లేస్ లో పటాస్ ఫేమ్, బిగ్ బాస్ 3 రన్నర్ శ్రీముఖిని తీసుకురావాలని భావిస్తున్నారట.
అయితే గతంలో మొదట జబర్దస్త్ కు శ్రీముఖినే అడిగారట. తనపై కుళ్ళు జోక్ లు వేస్తే తట్టుకోటం నా వల్ల కాదని అప్పట్లో జబర్దస్త్ ఆఫర్ వదులుకుందట. కానీ ఇప్పుడు శ్రీముఖి కూడా ఆరితేరింది. కాబట్టి ఖచ్చితంగా శ్రీముఖి నో చెప్పదని అందరు అనుకుంటున్నారు. మరి అనసూయ నిజంగా వెళ్తుందా, ఒకవేళ వెళ్తే శ్రీముఖి ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.