శ్రీ ముఖి..బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరంలేని పేరు. పటాస్ షో తో తెలుగు ప్రేక్షకులను దగ్గరైన ఈ అమ్మడు అప్పుడప్పుడు వెండితెర పై కూడా మెరుస్తూ ఉంటుంది. ఇటీవల జరిగిన బిగ్ బాస్ సీజన్ 3 లో రన్నర్ గా నిలిచి బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఈ అమ్మడు ఫ్రెండ్స్ తో తెగ ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా శ్రీ ముఖి కొన్ని ఫోటోలను రిలీజ్ చేసింది. సంప్రదాయబద్ధంగా చిరునవ్వు నవ్వుతు కొన్ని ఫోటో లను పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. శ్రీ ముఖి ఫోటోలను చూసిన నెటిజన్లు ఆమె అందాలపై కవితలు రాస్తూ, పొగడ్తలతో ముంచుతున్నారు.
మరి కొన్ని రోజుల్లో సెలెబ్రేషన్స్ విత్ సెలబ్రిటీ పేరుతో శ్రీ ముఖి బుల్లితెరపై రాక్ స్టార్ గా మెరవనుంది.