యాంకర్ సుమ. బుల్లితెర షోలకైనా, సినిమా ఫంక్షన్లకైనా సుమ ఉంటె ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుంది. కేరళ నుంచి వచ్చినా సరే తెలుగులో స్పష్టంగా, అనర్గళంగా మాట్లాడగల సుమ ఈ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో కనిపించటం తగ్గిపోయింది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఒకప్పుడు ఏ హీరో అయినా తన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుమ కచ్చితంగా ఉండాల్సిందేనని పట్టుబట్టేవారంటే అతిశయోక్తి కాదు. అలాంటిది ఇప్పుడు సుమను కాదని యాంకర్ మంజూషని అందరు ఫ్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే సుమ ప్రీరిలీజ్ ఈవెంట్లో రెండు గంటలకుగాను మూడు నుంచి ఐదు లక్షలు వరకు డిమాండ్ చేస్తుందట. సుమతో పోల్చుకుంటే మంజూష చాలా తక్కువకే వస్తుంది కాబట్టి ఎక్కువగా మంజూషని తీసుకుంటున్నారట.
అయితే సుమ తీసుకుంటున్న అమౌంట్ పెద్ద సినిమాల నిర్మాతలకు అంత పెద్దగా అనిపించకపోయినా, చిన్న సినిమాలకు మాత్రం అది పెద్ద మొత్తంలో కనిపిస్తుందట. చిన్న సినిమాల విషయంలో కూడా తగ్గితే పెద్ద సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్ లలో తన మార్కు కనిపించదని భావిస్తోందట సుమ. ఇప్పటికే టాలీవుడ్ లో అటు సుమ కి పోటీగా, ఝాన్సీ, అనసూయ, శ్రీముఖి, రష్మీ, ప్రదీప్ ఇలా ఎవరి స్పీడ్ వాళ్ళు చూపిస్తున్నారు. ఎంత మంది యంగ్ యాంకర్లు వచ్చిన సుమ జోష్ మీద నిలవలేకపోతున్నారనే చెప్పాలి.