సంతూర్ సోప్ యాడ్ అనగానే గుర్తొచ్చేది మమ్మీ అంటూ ఓ పాప అందమైన భామ దగ్గరకు పరుగెత్తుకుంటూ రావటం, మమ్మీ…? అంటూ జనం ఆశ్చర్యపోవటం ఎన్నో రోజులుగా చూస్తున్నదే. అంత ప్రాచుర్యం పొందిన యాడ్ కాబట్టే అందులో నటీనటులు మారుతున్నా… యాడ్ కాన్సెప్ట్ మాత్రం మారటం లేదు. అయితే… ఇప్పుడు యాంకర్ సుమ సంతూర్ మమ్మీ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడే ఎందుకు ఈ టాపిక్ వచ్చింది అనే కదా మీ డౌట్…?
సుమ తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ ఫోటో పెట్టింది. ఆ ఫోటోలో సుమతో పాటు సుమకన్నా పొడుగ్గా ఓ వ్యక్తి ఉన్నాడు. నా ప్రియమైన రోషన్ ఎంత ఎదిగిపోయాడు… లవ్ యూ రా అని కామెంట్ చేసింది. ఇంతకీ ఎవరతను అని ఆరా తీస్తే… అతను సుమ కొడుకు రోషన్. ఇలా సుమ తన కొడుకుతో ఉన్న ఫోటోను షేర్ చేయటంతో… సుమ అభిమానులంతా సంతూర్ మమ్మీ అంటూ కామెంట్ చేస్తున్నారు.