యాంకర్ వర్షిణీ… వచ్చీ రానీ తెలుగుతో, అమాయకత్వపు యాక్టింగ్‌తో బండి నెట్టుకొస్తున్న యాంకర్. ఈ మధ్య కాస్త గ్లామర్ కూడా టచ్ చేసి పటాస్ తో పాటు కొన్ని షోలను చేస్తోంది. అయితే పటాస్ షోలో కమెడియన్ ముక్కు అవినాష్‌తో లవ్ క్లాస్ అంటూ మొదలైన ఓ టాపిక్‌లో అవినాష్ వర్షిణీపై బెడ్ రూం పంచ్ వేయటంతో చెంప చెళ్లుమనిపించింది. ఆ తర్వాత కాస్త కవర్ చేసే ప్రయత్నం చేసినా… వర్షిణీ రియాక్షన్ చూస్తే గట్టిగానే స్పందించినట్లు అర్థమవుతోంది.
పటాస్‌లో స్టూడెంట్స్ వేసే కామెంట్స్‌లో భాగంగా క్లాస్‌రూంలో లవ్ క్లాస్ టాపిక్ వస్తుంది. టీచర్స్‌గా అవినాష్, వర్షిణీ చేస్తున్నారు. ఆ సమయంలో… ఇప్పుడు లవ్ క్లాస్ తర్వాత బెడ్ రూం క్లాస్ చెప్తాం అనగానే వెంటనే వర్షిణీ అవినాష్ చెంప చెళ్లుమనిపిస్తుంది. దీంతో మరో యాంకర్ చంటితో సహా అంతా అలా చూస్తుండిపోయారు.
కామెడీ కాస్త ఓవర్ డోస్ అయితే ఇలాగే ఉంటుంది ఫలితం అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి.