బాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ మూవీ అంధాధున్ ను తెలుగు లో ఇటీవల మాస్ట్రో పేరుతో నితిన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటించారు. అలాగే తమన్నా మరో కీలక పాత్రలో నటించారు. ఓటీటీ లో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
ఇక ఇప్పుడు ఈ చిత్రం మలయాళంలో తెరకెక్కుతోంది. రవి కె.చంద్రన్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇందులో హీరోయిన్ గా రాశి ఖన్నా నటించింది. బాలీవుడ్ లో టబు చేసిన పాత్రను మమతా మోహన్ దాస్ చేసింది. మమతా మోహన్ దాస్ ప్రియుడిగా ఉన్ని ముకుందన్ నటించారు. అక్టోబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది.