జనవరి 9వ తేదీ మద్యాహ్నం నుండి ఆంధ్రా బ్యాంక్ వినియోగదారుల అకౌంట్ లో డబ్బులు జీరో గా చూపివ్వడంతో కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. విషయం తెల్సిన వెంటనే బ్యాంక్ లకు పరిగెత్తారు..బ్యాంక్ లు బంద్ ఉండడంతో లబోదిబో మంటూ కస్టమర్ల కేర్లకు ఫోన్లు చేసి అసలు విషయం తెల్సుకొని హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు.
అకౌంట్ ఎందుకు జీరో అయ్యింది.?
ఆంధ్రా బ్యాంక్ నుండి యూనియన్ బ్యాంక్ కు ఐటి సిస్టమ్ మారుతున్న కారణంగా ఆంధ్ర బ్యాంక్ లో ఖాతా వున్న ప్రతి ఒక్కరి అకౌంట్ “0” గా చూపింస్తుంది. వాళ్ల అకౌంట్ లో ఉన్న డబ్బు తిరిగి వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. తేదీ 8-1-2021 రాత్రి 10 గంటల నుండి 11-01-2021 ఉదయం 6 గంటల వరకు ఏటీఎం ఆన్లైన్ సర్వీస్ మరియు ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ లు పనిచేయవని ముందుగానే సమాచారమిచ్చారు బ్యాంక్ అధికారులు .