ఏపీ సీఎం జగన్ హమీ మేరకు ఏపీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయనున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రత్యేకంగా కమిటీ అధ్యయనం కూడా చేస్తున్న తరుణంలో… ప్రభుత్వంలో విలీనం చేసేందుకే సర్కార్ మొగ్గుచూపుతోంది.
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేసే ముసాయిదా బిల్లుకు ఏపీ క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది సర్కార్. ఈ తాజా నిర్ణయం ద్వారా దాదాపు 55వేల మంది లబ్ధి పొందబోతున్నారు.
అయితే, ఎవరి క్యాడర్ ఎంటీ…? ఎవరికి ఏ క్యాడర్ ఇవ్వబోతున్నారు అనేది ఉద్యోగ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.
మహిళల కోసం ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం