ఏపీలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24గంటల్లో 9597 కొత్త కేసులు రాగా, మరో 93మంది మరణించారు. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,54,146కు చేరింది. ఏపీలో కరోనా కారణంగా ఇప్పటి వరకు 2296మంది మరణించారు.

కరోనా వైరస్ కారణంగా కొత్తగా మరణించినన వారిలో గుంటూరు జిల్లాలో 13 మంది, ప్రకాశంలో 11 మంది, చిత్తూరులో 10 మంది, నెల్లూరులో 10 మంది, శ్రీకాకుళంలో 9 మంది, అనంతపురంలో ఏడుగురు, కడపలో ఏడుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, కర్నూలులో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, కృష్ణాలో ఇద్దరు మరణించారు.
రాష్ట్రంలో మొత్తం 2,54,146 పాజిటివ్ కేసులుండగా… 90,425మంది చికిత్స పొందుతున్నారు. 1,61,425 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.