ఏసీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం మే 22 నుండి అమలు కాబోతుందా…? ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులు అమలు కావాల్సిందునన్న పట్టుదలతో ప్రభుత్వం ఉందా…? అమరావతి నుండి ఆఫీసుల తరలింపుపై నిర్ణయం జరిగిపోయిందా…? అంటే అవుననే అంటుంది ప్రముఖ వార్తా సంస్థ.
ఇండియాలోనే పేరేన్నిక గన్న వార్తా సంస్థ పీటీఐ కథనం ప్రకారం… మే22 నుండి విశాఖపట్నం రాజధానిగా మారబోతుందని, సచివాలయం సహా హెచ్ఓడి ఆఫీసులు తరలింపుపై నిర్ణయాలు జరిగాయని సంచలన కథనాన్ని ప్రచురించింది.
ఏపీ మూడు రాజధానులపై పెట్టిన బిల్లు మధ్యలోనే మండలిలో ఆగిపోయింది. సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ ఆదేశించినా… సెక్రెటరీ నిలుపుదల చేయటంతో ఆ బిల్లు అలా ఉండిపోయింది. అయితే… నాలుగు నెలలు అనే కాల వ్యవధిలోపు నిర్ణయం జరగకపోతే… యాధావిధిగా బిల్లు పాసయినట్లే అన్న నిబంధనతో ఏపీ సర్కార్ గట్టెక్కాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల సమాచారంగా కథనాలు వచ్చాయి.
సీఎం జగన్ దూకుడు చూస్తుంటే… మే 22 తర్వాత విశాఖపట్నం నుండే పరిపాలన చేసే యోచనలో ఉన్నారని, అప్పుడు ఎలాగు చట్టం అవుతుంది కాబట్టి కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు అన్న కాన్ఫిడెంట్ తో ఉన్నట్లు తెలుస్తోంది.