వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాజధానిగా విశాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి దాన్నిజేఏసీ ప్రతినిధులకు ఆయన అందజేశారు.
అనంతరం టీడీపీ నేత అచ్చన్నాయుడికి ఆయన సవాల్ విసిరారు. దమ్ముంటే అచ్చెన్నాయుడు కూడా రాజీనామా చేయాలని సవాల్ చేశారు. విశాఖ రాజధానిని రైతులు వ్యతిరేకిస్తే తాము కూడా అమరావతిని వ్యతిరేకిస్తామన్నారు.
కార్యనిర్వహక రాజధానికి అనుకూలంగా తాను చోడవరంలో పోటీ చేస్తానని, అచ్చెన్నాయుడు కూడా టెక్కలిలో పోటీకి సిద్దం కావాలన్నారు. కార్యనిర్వాహక రాజధానిని కొందరు నాయకులు వ్యతిరేకిస్తున్నారనిఆయన అన్నారు.
వారందరినీ రాజకీయాల నుంచి వెలివేయాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వారం రోజుల పాటు నియోజకవర్గ కేంద్రాల్లో విస్తృతంగా సభలు, సమావేశాలు, ర్యాలీలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈనెల 15న భారీ నిరసన ప్రదర్శన చేపడతామని ఆయన వెల్లడించారు.