విశాఖలో ఆర్ ఆర్ వెంకటాపురం వద్ద పరిశ్రమలో గ్యాస్ లీకైన ఘటన దురదృష్టకరమన్నారు ఏపీ డీజీపి గౌతమ్ సవాంగ్. తెల్లవారుజామున డైల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం వచ్చిందని తక్షణమే స్పందించి అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారని తెలిపారు. పరిసర జిల్లాల నుండి అధికారులను, సిబ్బందిని ,ఏపీపిఎస్సి బలగాలను సంఘటన స్థలానికి పంపి బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టామని డీజీపీ తెలిపారు. ప్రజలను రక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని పరిస్థితినిఎప్పటికప్పుడు సమీక్షిస్తు, ఘటనపై వివరాలను ముఖ్యమంత్రి కి వివరిస్తున్నామన్నారు.