జగన్ పరామర్శ - andhra pradesh godavari boat capsize live updates cm jagan tour- Tolivelugu

జగన్ పరామర్శ

andhra pradesh godavari boat capsize live updates cm jagan tour, జగన్ పరామర్శరాజమహేంద్రవరం: బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో సీయం సంఘటనా స్థలానికి వెళ్లారు.  లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. రాజమండ్రి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు.  బాధితుల దగ్గరకు వెళ్లి  ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. సీఎం జగన్‌  వెంట తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ కూడా ఉన్నారు.

మీరొచ్చి నాలో ధైర్యం నింపారు : జగన్‌తో మాధవిలత

సీఎంను చూసి తిరుపతికి చెందిన మాధవిలత కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదంలో భర్త సుబ్రహ్మణ్యం, కుమార్తె మరణించారంటూ సీఎంకు చెప్పి రోదించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తనను డాక్టర్లు బతికించారని ముఖ్యమంత్రికి వివరించారు. తన భర్త ఉప్పుడూ మీ గురించే చెప్పేవారని, కష్టాల్లో గుండె ధైర్యం తెచ్చుకుని ఎలా బతకాలో చెప్తూ మీ గురించి తరచుగా ప్రస్తావించేవారని మధులత సీయం జగన్ దగ్గర ప్రస్తావించారు. మీరొచ్చి నాలో ధైర్యాన్ని నింపారని చెప్పారు.

ముమ్మరంగా సహాయక చర్యలు

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో జరిగిన బోటు ప్రమాదంపై ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు జరుపుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇప్పటికే 8 ఈఆర్‌ బృందాలు, 12 ప్రత్యేక గజ ఈతగాళ్ల బృందాలు, 6 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఒక నావీ చాప్టర్, ఓఎన్‌జీసీ చాప్టర్‌ ప్రత్యేక బృందాలు, నేవీ బృందాలతో పాటు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp