మతపరమైన వివాదాలు ఇటీవల ఏపీలో ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో హిందూవులు, క్రైస్తవుల మధ్య ఓ వివాదం రాజుకుంది. స్మశాన వాటికలో శివుని విగ్రహన్ని ప్రతిష్టించాలని హిందూవులు భావిస్తే..క్రైస్తవులు దానిని అడ్డుకున్నారు. చివరికి శివుని విగ్రహాం ఎమ్మార్వో ఆఫీస్‌కు చేరింది.
పూర్తివివారాల్లోకి వెలితే రంగంపేట మండలం కోటపాడులోని హిందూ శ్మశాన వాటికలో శివుడి విగ్రహం ప్రతిష్టించేందుకు హిందూవులు ఏర్పాట్లు చేశారు. చుట్టూ ప్రహరి నిర్మించి మధ్యలో శివుని విగ్రహం ఉంచాలని భావించారు. అయితే దీనికి క్రైస్తవులు అడ్డుపడ్డారు. తమ నివాసాలకు ఎదురుగా ఉన్న శ్మసానవాటికలో శివుడి విగ్రహం పెట్టడానికి వీలులేదని ఆందోళనకు దిగారు.
దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. సుమారు రెండు రోజుల పాటు ఈ వివాదం నడవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం తహసీల్దార్ ఆఫీస్‌కు ఈ వివాదం చేరింది. ఇరువురి పెద్దలతో మాట్లాడి ప్రస్తుతానికి విగ్రహ ప్రతిష్ఠను నిలిపివేయించారు.గ్రామ పెద్దలతో కలిసి పీస్ కమిటీ ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని అధికారులు సూచించారు.
అప్పటివరకు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. శివుని విగ్రహాన్ని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉంచారు. శివును విగ్రహ ప్రతిష్ఠను అడ్డకోవడంపై నిరసనగా ఛలో కోటపాడుకి విశ్వ హిందు పరిషత్, భజరంగ్ దళ్ పిలుపునిచ్చాయి.