కొడుకు చేసేఅప్పులు తీర్చలేక హతమార్చిన తల్లి…!
వ్యసనాలకు బానిసైన కొడుకును భరించలేక..తరుచూ అతను చేస్తున్న అప్పులు తీర్చలేక కడుపుతీపి మరచిపోయింది ఓతల్లి. నవమాసాలు మోసి చెట్టంత వాణ్ణి చేసిన ఆ తల్లి…తన చేతులారా తానే కొడుకుని చంపుకుంది. కసాయిగా మారిన ఆమె..కొడుకు తలపై రోకలిబండతో మోది హత్య చేసింది. అయితే ఈ హత్యా నేరం తనమీదకు రాకుండా ఉండేందుకు విశ్వప్రయత్నాలు చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..కృష్ణ జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది.తల్లే తన కొడుకు దీప్‌చంద్‌ను హత్య చేసి తన కొడుకును ఎవరో చంపేశారంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.. ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లారు.. తల్లి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో ఆరాతీసిన పోలీసులకు అసలు విషయం బయటపడింది.
గన్నవరం ఏసీపీ విజయపాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొడుకు చేసిన అప్పులు కట్టలేక ఈ దారుణానికి ఒడిగట్టింది. దీప్ చంద్..అప్పులు చేయడమే కాదు..తల్లి రమను డబ్బులు కావాలి ఇస్తావా ? చస్తావని వేధించడంతో..ఆ బాధను తట్టుకోలేక విసిగిపోయిన ఆ తల్లి…కొడుకుని దూరంచేసుకోవాలని నిర్ణయించుకుంది.
ఉదయం 5.30 గంటలకు దీప్ చంద్ తండ్రి లేచి పనికి వెళ్లిపోగా..ఆ తర్వాత కొద్దిసేపటికి నిద్రపోతున్న కొడుకుని రోకలిబండతో మోదీ చంపేసింది తల్లి.. అయితే, అనంతరం తలుపు వేసి తల్లి బయటికి వెళ్లి పశువుల దగ్గర పని చూసుకుంది..
ఉదయం 6:30 గంటలకు పాలు తీసుకుని తిరిగి ఇంటికి వచ్చింది.. ఆ తర్వాత తన భర్తకు ఫోన్ చేసి ఎవరో వచ్చి.. మన అబ్బాయిని కొట్టి వెళ్లిపోయారు.. రక్తం మడుగులో పడి ఉన్నాడు అని సమాచారం చేరవేసింది.. ఎవరో వచ్చి కొట్టి చంపినట్టు గ్రామస్తుల్ని, పోలీసుల్ని కూడా నమ్మించే ప్రయత్నం చేసింది..
ఇక, తన కూతురు కుమార్తెను తానే చూసుకుంటున్న నిందితురాలు..ఆ పిల్లల్ని రెడీ చేసి స్కూల్‌కి పంపించేసింది..కొడుకు చనిపోతే.. మనవరాలిని ఎలా స్కూల్‌కు పంపించింది..? అనే కోణంలో పోలీసులకు అనుమానం వచ్చింది..దీంతో, ఆమెను తమదైన శైలిలో విచారించగా.. నేనే కొట్టి చంపానని అంగీకరించింది తల్లి.