మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు పురిటిగడ్డ నారావారి పల్లెలో సంక్రాంతి సందడి నెలకొంది. అటునారావారు,ఇటు నందమూరి వారి కలయికతో సంక్రాంతి పండుగు కనుల పండువగా మారింది.ఈ సందర్భంగా తిరుపతి నాగాలమ్మకట్ట వద్ద జరిగుతున్న వేడుకలో ఆధ్యంతం ఆసక్తి చోటుచేసుకుంది.
చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ పాల్గొనడంతో ఇటు రాజకీయ ప్రముఖులు, అటు సినీ అభిమానులతో నాగాలమ్మకట్ట ఆవరణం కిటకిట లాండింది. ఇది ఇలాఉంటే..చంద్రబాబు,బాల కృష్ణల ముద్దుల మనవడు…నారాలోకేష్ తనయుడు దేవాన్ష్ చిలిపి చేష్టలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నువ్వు కూర్చున్న కుర్చీ కావాలంటూ దేవాన్షు తాత చంద్రబాబు నాయుణ్ణి లేపేసాడు. మనవడి కోరిక మేరకు రాజకీయ పండితుడైన చంద్రబాబు తనంత తానుగా లేచి సదరు కుర్చీని మనవడు దేవాన్షుకి ఇవ్వాల్సి వచ్చింది. మరో తాత బాలకృష్ణను సైతం విడిచిపెట్టలేదు దేవాన్ష్.
తన పిచ్చివేషాలు వేస్తే ఫ్యాన్స్ ని సైతం చెంప చెళ్ళుమనిపించే బాలకృష్ణను నీళ్ళబాటిల్ తో కొడుతూ అల్లరిచేసాడు దేవాన్ష్. ఓ వైపు ఆలయం వద్దమహిళలు పూజలు చేస్తుంటే…వియ్యంకులిద్దరూ ముద్దుల మనవడితో ఆడుకున్నారు.నారా వారి కుటుంబంలోని బంధువులు,ఇటు నందమూరి కుటుంబంలోని బాలకృష్ణ దంపతులు కొడుకు మోక్షజ్ఞ సందడి చేసారు.
నారావారి పల్లెలో తల్లిదండ్రుల సమాధివద్ద నివాళులు అర్పించారు. బట్టలు పెట్టి తర్పణమర్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. రేపు అన్నమయ్య జిల్లా పీలేరు సబ్ జైలుకు వెళ్ళనున్నారు చంద్రబాబు. జైలుపాలైన పుంగనూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలను పరామర్శించనున్నారాయన.
ఈ నెల 7వ తేదీన రొంపిచర్లలో చల్లాబాబు ఫ్లెక్సీలను చించడానికి వచ్చిన వైసీపీ కార్యకర్తలను టీడీపీ క్యాడర్ అడ్డుకుంది. ఈ నేప
థ్యంలో ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో టీడీపీ క్యాడర్ పై హత్యాయత్నం సెక్షన్ సహాపలు సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి.8 మంది టీడీపీ కార్యకర్తలను పీలేరు సబ్ జైలుకు వెళ్ళి పరామర్శించనున్నారు పార్టీ అధినేత చంద్రబాబు.