ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గటం లేదు. ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం మరో 67 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1717కు చేరగా, మరణాల సంఖ్య 34కు చేరింది.
ఏపీలో తాజాగా నమోదైన కేసుల్లో కర్నూలులో 25, గుంటూరులో13, కృష్ణా 8, కడప 2, విశాఖలో 2, అనంతపురంలో 2, నెల్లూరు 1, ఇతరులు 14 కేసులు నమోదయ్యాయి. గుజరాత్ నుండి వచ్చిన వారిలో 14మందికి కరోనా సోకినట్లు ఏపీ ప్రకటించింది.
ఏపీలో ప్రస్తుతం 1094 మంది చికిత్స పొందుతుండగా, కరోనా బారిన పడి 589 మంది కోలుకున్నారు.